ప్రధానమంత్రి నరేంద్రమోదీ గాంధీనగర్‌లో తల్లి హీరాబెన్‌తో కాసేపు ఆత్మీయంగా గడిపారు. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాలని ఆశీర్వదించిన మాతృమూర్తి... కుమారుడికి శాలువా, మిఠాయిలు, కొబ్బరికాయ ఇచ్చారు.
ప్రధాని మోదీకి అమ్మ దీవెనలు, మిఠాయిలు - హీరాబేన్ మోదీ
నరేంద్రమోదీ ఓటేయటానికి ముందు గాంధీనగర్‌లో తల్లిని కలిశారు. శాలువా, స్వీట్లు, కొబ్బరికాయను కుమారుడికి ఇచ్చి, మనసారా ఆశీర్వదించారు హీరాబెన్.
మాతృమూర్తితో ఆశీర్వాదం తీసుకున్న మోదీ
దాదాపు 20 నిమిషాలు తల్లితో గడిపారు మోదీ. అనంతరం ఇంటిబయట ఉన్న ప్రజలతో కరచాలనం చేశారు. కొందరు యువకులు మోదీతో స్వీయచిత్రాలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరు తప్పకుండా ఓటేయాలని సూచించారు ప్రధాని.
Last Updated : Apr 23, 2019, 11:20 AM IST