తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ధైర్యంగా ముందడుగు వేయండి- మీతో నేనుంటా' - ప్రధాని

ల్యాండర్​ విక్రమ్​తో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ అండగా నిలిచారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందడుగు వేయాలని ప్రోత్సహించారు. తాను ఎప్పుడు తోడుంటానని శాస్త్రవేత్తలకు చెప్పారు మోదీ. ఈ ఉదయం 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని.

'ధైర్యంగా ముందడుగు వేయండి- మీతో నేనుంటా'

By

Published : Sep 7, 2019, 5:04 AM IST

Updated : Sep 29, 2019, 5:45 PM IST

'ధైర్యంగా ముందడుగు వేయండి- మీతో నేనుంటా'

చందమామపై ల్యాండర్​ విక్రమ్ దిగుతున్న​ సమయంలో తలెత్తిన సమస్య వల్ల నిరుత్సాహానికి గురైన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండగా నిలిచారు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజమని చెప్పారు.

"మీ ముఖాలు వాడిపోయినట్టు కనిపిస్తున్నాయి. కానీ మీరు చేసింది చిన్న విషయమేమీ కాదు. దేశం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది. మీ శ్రమతో ఎంతో నేర్పించారు. ఆశలు వదులుకోకూడదు. నా తరఫు నుంచి మీ అందరికీ అభినందనలు. దేశానికి మీరు ఎంతో గొప్ప సేవ చేశారు. మన ప్రయాణం కొనసాగుతుంది. నేను పూర్తిగా మీకు తోడుగా ఉంటాను. ధైర్యంతో ముందడుగు వేయండి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

అంతా సజావుగా సాగుతున్న సమయంలో ల్యాండర్​ 'విక్రమ్​'లో సమస్య తలెత్తడం వల్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలీమీటర్ల దూరంలో విక్రమ్​తో సంబంధాలు తెగిపోయాయి.

చంద్రయాన్​-2లోని కీలక ఘట్టాన్ని వీక్షించడానికి దేశ నలుమూలల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులతో కొంతసేపు ముచ్చటించిన అనంతరం ప్రధాని ఇస్రో కేంద్రం నుంచి వెనుదిరిగారు మోదీ. అనంతరం ల్యాండర్​తో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో అధికారిక ప్రకటన చేసింది.

రాష్ట్రపతి ట్వీట్....

చంద్రయాన్​-2పై రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ స్పందించారు. ఇస్రో శాస్త్రవేత్తలు అసమాన నిబద్ధత, ధైర్యసాహసాలను చూపించారని... దేశం ఎంతో గర్వ పడుతోందన్నారు.

రాష్ట్రపతి ట్వీట్​

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ... వారి సేవలను కొనియాడారు. ఇస్రో శ్రమ ఎన్నటికీ వృథా కాదని ట్వీట్​ చేశారు.

రాహుల్​ ట్వీట్​

ఇదీ చూడండి:- చంద్రయాన్​-2: విక్రమ్ ల్యాండింగ్​లో సమస్య!

Last Updated : Sep 29, 2019, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details