తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రేమ, సోదర భావానికి ప్రతీక బక్రీద్​' - మోదీ

ఈద్​ ఉల్​ అజాను పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ. ప్రేమ, సౌభ్రాత్రం, మానవ సేవకు బక్రీద్​ ప్రతీక అని పేర్కొన్నారు.

'ప్రేమ, సోదర భావానికి ప్రతీక బక్రీద్​'

By

Published : Aug 12, 2019, 9:35 AM IST

Updated : Sep 26, 2019, 5:40 PM IST

బక్రీద్​ సందర్భంగా ప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుభాకాంక్షలు తెలిపారు. దేశవిదేశాల్లో ఉన్న ప్రజలు.. ముఖ్యంగా ముస్లింలకు ప్రత్యేక సందేశమిచ్చారు.

రాష్ట్రపతి శుభాకాంక్షలు

"ప్రేమ, సోదర భావం, మానవ సేవకు ఈద్​ ఉల్​ అజా ప్రతీక. ఈ విలువలను మనం పాటించి మన సంస్కృతికి కట్టుబడి ఉందాం."

-రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

బక్రీద్​తో సమాజంలో శాంతి, సౌఖ్యం పెరగాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

మోదీ ట్వీట్

"ఈద్​ ఉల్​ అజా సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పర్వదినం.. సమాజంలో శాంతి, సౌఖ్యం పెంపొందించాలి."

-ప్రధాని నరేంద్రమోదీ

ఇదీ చూడండి: జమ్ము కశ్మీర్​లో ఆంక్షల నడుమే బక్రీద్​

Last Updated : Sep 26, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details