తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"సమయం దగ్గర పడిందని మోదీ భయపడుతున్నారు"

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. అధికారం నుంచి దిగిపోయే సమయం వచ్చిందని మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​లో ఓబీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఘాటు విమర్శలు

By

Published : Mar 27, 2019, 9:21 PM IST

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ఘాటు విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తీవ్రంగా విమర్శించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. అధికారం నుంచి దిగిపోయే సమయం వచ్చిందని మోదీ భయపడతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఓబీసీ విభాగం కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్​.

ఇటీవల ప్రకటించిన న్యాయ్​ (ఎన్​వైఏవై) కనీస ఆదాయ భరోసా పథకంలో భాగంగా దేశంలోని ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని తెలిపారు. పేదరికం నుంచి వారిని బయటపడేయటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

ఓబీసీలకు కాంగ్రెస్​ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసానిచ్చారు రాహుల్​.

"కాంగ్రెస్​ పార్టీ కనీస ఆదాయం పథకం(న్యాయ్​) గురించి మాట్లాడటం ప్రారంభించాక ప్రధాని మోదీ ముఖ కవలికలు మారిపోయాయి. భయం కనిపిస్తోంది. మోదీ అధికారం నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తి. ఆయనకు దిగిపోయే సమయం వచ్చింది. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చే సమయం వచ్చింది. రానున్న రోజుల్లో మీకు కాంగ్రెస్​ పార్టీలో స్థానం ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీలో ఇద్దరు ఓబీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఓబీసీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వస్తారు. నేను భరోసా ఇస్తున్నా. నరేంద్ర మోదీలా నేను అబద్ధాలు చెప్పను. ఓబీసీలకు, పేదలకు, ఆదివాసీలకు, రైతులకు కాంగ్రెస్​లో స్థానం ఉంటుంది. దేశంలోని యువత వ్యాపారం చేసుకోవటానికి మేకిన్​ ఇండియాలో భాగంగా మూడేళ్ల వరకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం. "

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ప్రజలకు రూ.15 లక్షలు ఇస్తామని2014 ఎన్నికల్లో హామీ ఇచ్చి..మోదీ మోసం చేశారని రాహుల్​ విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకంలో భాగంగా ఒక్కో పేద కుటుంబానికి రూ.72 వేలు కచ్చితంగా ఇస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజలకు పని కల్పించటంపై మాట్లాడుతుందే తప్ప మనసులో మాట గురించి కాదని ప్రధాని రేడియో కార్యక్రమంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు రాహుల్​.

మోదీ ప్రభుత్వ మేకిన్​ ఇండియా పథకంపైనా విమర్శలు చేశారు రాహుల్​. ప్రజలకు మేకిన్​ ఇండియా కావాలి... కానీ దాన్ని అంబానీ తయారు చేయాల్సిన అవసరం లేదన్నారు.

ABOUT THE AUTHOR

...view details