ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు... భాజపాయేతర పార్టీల నేతల్ని కలవడంపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు.
ఎన్నికల ప్రచారం కోసం హరియాణా రోహ్తక్ వెళ్లిన మోదీ... అత్యంత అసాధారణ రీతిలో ఏఎన్ఐ ప్రతినిధికి ముఖాముఖి ఇచ్చారు.
నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
"ఎన్నికల పోలింగ్ పరిస్థితి చూస్తే మొదటి మూడు దశల్లో నన్ను దూషించారు. ఆ తర్వాత వాళ్ల కింది భూమి కదిలిపోతుందని తెలిశాక ఈవీఎంలపై పడ్డారు. మూడు భాగాలుగా ఆరోపణలను విభజించారు. ఒక భాగం మోదీకి, రెండో భాగం ఈవీఎంలకు, మూడో భాగం ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు... ప్రజలు వారిని ఎన్నుకునేందుకు సిద్ధంగా లేరని. ఎలాగంటే ఎవరైనా ఆటగాడు అవుట్ అయితే అంపైర్‌ను తిట్టినట్టు ఉంది వారి స్థితి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'