తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం 'యోగా': మోదీ

ప్రజలకు ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. యోగాను ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనంగా అభివర్ణించారు. ప్రపంచ దేశాలు యోగాను అనుసరిస్తున్నందుకు హర్షం వక్తం చేశారు . రాంచీలోని ప్రభాత్​ తారా మైదానంలో 'యోగా డే' వేడుకలకు హాజరయ్యారు మోదీ.

By

Published : Jun 21, 2019, 8:45 AM IST

Updated : Jun 21, 2019, 8:55 AM IST

ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనం 'యోగా': మోదీ

ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యోగా సాధనతో శాంతి, సంతోషం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయన్నారు. ప్రాచీన, ఆధునిక ఆరోగ్య సాధనంగా యోగాను అభివర్ణించారు మోదీ. ఝార్ఖండ్ రాంచీలో నిర్వహించిన ఐదో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని.

యోగాను దేశంలోని మారుమూల ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరముందన్నారు మోదీ. పేదలకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా యోగా నివారించగలదని తెలిపారు.

"నేడు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న లక్షలాది మందికి అభినందనలు. యోగాకు వయస్సు, రంగు, కులం, మతం, ప్రాంతం తేడా లేదు. యోగా అందరిదీ. అందరూ యోగాను అనుసరించాలి. ఆధునిక యోగాను గ్రామాలు, ఆదివాసీ ప్రాంతాల్లోనూ విస్తరించాల్సిన అవసరముంది. మనమందరం కలిసి యోగాను పట్టణాల నుంచి గ్రామాలకు, అటవీ ప్రాంతాలకు, ప్రతి మారుమూల ప్రాంతానికీ విస్తరింపచేద్దాం. పేదలు, ఆదివాసీల ఇళ్ల వరకు యోగా చేరాలి."
- నరేంద్ర మోదీ, ప్రధాని.

రాంచీలో యోగా డే వెేడుకలో ప్రసంగించిన మోదీ

ఇదీ చూడండి:అట్టహాసంగా 'యోగా డే' పండగ

Last Updated : Jun 21, 2019, 8:55 AM IST

ABOUT THE AUTHOR

...view details