ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. ఉగ్ర శిబిరాలపై ఇటీవల చేపట్టిన వైమానిక దాడులపై ప్రధానమంత్రే ప్రశ్నిస్తున్నారని, ప్రతిపక్షాలు ఆధారాలు అడగట్లేదని గమనించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి పేర్కొన్నారు.
"దాడులను మోదీనే ప్రశ్నిస్తున్నారు" - ప్రధాని మోదీ
రఫేల్ యుద్ధవిమానాలు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్న మోదీ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇటీవల జరిగిన వైమానిక దాడులను ప్రధాని మోదీయే తప్పుబడుతున్నారని స్పష్టమవుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.
రఫేల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవన్న ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు తివారి. ప్రధాని ప్రకటనలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో చేసుకున్న ఒప్పందం, చర్చలను మోదీ ప్రభుత్వం రద్దు చేయటంతోనే రఫేల్ అప్పగింతలో జాప్యం ఏర్పడిందని ఆరోపించారు.
" వైమానిక దాడులను ఎవరు ప్రశ్నించారు?. ప్రతిపక్షాలు ప్రశ్నించలేదు. దాడులపై ప్రశ్నించింది భారత ప్రధానమంత్రినే. ఇలాంటి పరిస్థితి ఇంత వరకు జరగలేదు. మనవద్ద రఫేల్ ఉండి ఉంటే ఫలితాలు వేరే ఉండేవి, పరిస్థితులు వేరే ఉండేవని ప్రధాని అన్నారు. మీరు రఫేల్ కాంట్రాక్టును, గతంలోని చర్చలను రద్దు చేయటంతోనే రఫేల్ అప్పగింతలో జాప్యం ఏర్పడింది. మీ ప్రకటనలోని ఆంతర్యమేమిటి ?" - మనీష్ తివారీ, కాంగ్రస్ అధికార ప్రతినిధి