తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారు అభివృద్ధి చెందితే మేము కాపలా కాయాలా?' - బిహార్

బిహార్​లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్​ నేత నవజోత్​ సింగ్​ సిద్దూ మోదీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. బడా వ్యాపారులకే మోదీ చౌకీదార్​ అని ఆరోపించారు.

"మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని చౌకీదార్ చేయాలనుకుంటోంది"

By

Published : Apr 13, 2019, 7:25 AM IST

మోదీపై నవజోత్​ సింగ్​ సిద్ధూ విమర్శలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'నేనూ కాపలదారునే' ( మైబీ చౌకీదార్​) ప్రచారంపై కాంగ్రెస్​ నేత నవజోత్​ సింగ్​ సిద్దూ తీవ్ర విమర్శలు చేశారు. చైనా, అమెరికా, రష్యా అభివృద్ధిలో శర వేగంగా దుసుకుపోతుంటే... భారత్​లో మాత్రం అందరినీ కాపలాదారులను చేసే కార్యక్రమం నడుస్తోందని ఎద్దేవా చేశారు.

బిహార్​లోని కిషన్​గంజ్​లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సిద్దూ... బడా వ్యాపారుల భవనాలకే చౌకీదారులు కాపలాకాస్తారని, పేదలను విస్మరిస్తారని ఆరోపించారు.

"చౌకీదార్​ అంబానీ, అదానీకే కాపలాదారు. ఓట్ల కోసం సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​ అంటున్నారు. కానీ ఓటు వేశాక సబ్​ కా సాత్​, అంబానీ, అదానీకా వికాస్ అంటారు​. రఫేల్​ పత్రాలను కాపాడలేని ఆయన దేశాన్ని ఎలా పాలిస్తానని భరోసా ఇస్తారు? 5 వేల మంది దేశద్రోహులు వెయ్యి కోట్ల రూపాయలను దోచుకుని విదేశాల్లో దాచుకుంటే మీరు ఒక్కరిని కూడా పట్టుకోలేకపోయారు. వీరందరి పేర్లు బయటపెడితే నేనే మీకు ఓటేస్తా మోదీ. రానున్న రోజుల్లో ఇవేం ఉండవు. రాహుల్​ ఒక వెలుగులా వస్తారు." - నవజోత్​ సింగ్​ సిద్దూ, కాంగ్రెస్​ నాయకుడు.

మోదీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని, నోట్లరద్దుతో పేదల జీవితం అతలాకుతలమైందని విమర్శిచారు సిద్దూ.

ABOUT THE AUTHOR

...view details