తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15 విదేశీ భాషల్లో మోదీ పంద్రాగస్టు ప్రసంగం - ఆగస్టు 15 నాటి ప్రధాని ప్రసంగం

ఆగస్టు 15 నాటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి ప్రసంగాన్ని విదేశీ శ్రోతలు వినేందుకు వీలుగా ఆల్​ ఇండియా రేడియో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పదిహేను విదేశీ భాషలలో మోదీ  ప్రసంగాన్ని అనువదించి  ప్రసారం చేసింది. తొలిసారి ఇలాంటి ప్రక్రియ చేపట్టినట్లు ఆల్​ఇండియా రేడియో విదేశీ సేవల విభాగం ప్రకటించింది.

విదేశీ భాషలలో ఆగస్టు 15 నాటి ప్రధాని ప్రసంగం

By

Published : Aug 19, 2019, 5:32 AM IST

Updated : Sep 27, 2019, 11:33 AM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగాన్ని పదిహేను విదేశీ భాషల్లోకి అనువదించి ఆదివారం ప్రసారం చేసింది. ప్రధాని ప్రసంగాన్ని విదేశీ శ్రోతలు వినేందుకు వీలుగా ఆల్​ ఇండియా రేడియో ప్రసారం చేయడం ఇదే తొలిసారి.

" ఎర్రకోటపై మోదీ ప్రసంగాన్ని పూర్తిగా విదేశీ భాషలలో అనువాదించి ప్రసారం చేయడం ఇదే తొలిసారి. ఈ ప్రక్రియ ప్రసార భారతి సీఈఓ శశి శేఖర్​ వెంపటి చొరవ వల్లనే చేయగలిగాం. ఆల్​ ఇండియా రేడియోలో ప్రసారమయ్యే మన్​ కీ బాత్​ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభ దశ నుంచి విదేశీ భాషలలో అనువదించి ప్రసారం చేస్తాం."

- అమ్లన్​ మజుమ్మదర్, విదేశీ సేవల విభాగం డైరెక్టర్​​.

అరబిక్, బలూచి, బర్మీస్, చైనీస్, డారి, ఫ్రెంచ్, ఇండోనేషియాన్, పర్షియన్, పుష్టు, రష్యన్, సింహళ, స్వాహిలి, థాయ్, టిబెటన్ ,ఇంగ్లీష్ భాషలలో మోదీ ప్రసంగాన్ని అనువదించారు.

డిజిటల్ సేవలను పెంచేందుకు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ సామర్థ్యాన్ని చూపే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : ఈ నెల 23న యూఏఈకి ప్రధాని మోదీ

Last Updated : Sep 27, 2019, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details