తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి మండపమా..? మోదీ ఎగ్జిబిషనా..?? - మోదీ చిత్రాలు

అజ్మీర్​లోని భ్యావర్ కస్బేకు చెందిన ఓ వ్యక్తి మోదీ పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు వినూత్న రీతిని ఎంచుకున్నాడు. తన వివాహాన్ని నరేంద్రమోదీ థీమ్​తో నిర్వహించాడు. భాజపాను మళ్లీ గెలిపించాలని పెళ్లికి హాజరైన వారికి సందేశమిచ్చాడు.

పెళ్లి మండపమా..? మోదీ ఎగ్జిబిషనా..??

By

Published : May 14, 2019, 3:01 PM IST

పెళ్లి మండపమా..? మోదీ ఎగ్జిబిషనా..??

రాజస్థాన్ అజ్మీర్​లోని భ్యావర్ కస్బేలో సోమవారం జరిగిన ఓ వివాహం చర్చనీయాంశమైంది. లోక్​సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుతుండగా తన అభిమాన నేత గెలవాలని కోరుకుంటూ వినూత్నంగా పెళ్లి చేసుకున్నాడు ఓ అభిమాని. ఇలాంటి రాజకీయ థీమ్​తో పెళ్లి కార్డులు ఎన్నికల ప్రథమాంకం నుంచే చూస్తున్నాం అంటారా.! తాజా వివాహానిది 'అంతకుమించిన' రేంజ్.

వరుడు వీరేంద్ర సింగ్ నరూఖా ఐదేళ్ల క్రితం నరేంద్రమోదీ అభిమానిగా మారాడు. అప్పటి నుంచి అతడి అభిమానం పెరిగిపోతూ వచ్చింది. ఇటీవలే వీరేంద్ర సింగ్ పెళ్లి నిశ్చయమైంది. అప్పటి నుంచి అతడికి ఒకటే ఆలోచన. పెళ్లి ఏ విధంగా జరుగుతుందో అని అనుకుంటున్నారు కదూ! కాదు. తన పెళ్లిలో మోదీకెలా ప్రచారం కల్పించాలని. ఆకాశంలో తళుక్కున మెరిసినట్టు ఈ వీరాభిమానికి ఓ ఐడియా తట్టింది. తన వివాహం మొత్తం మోదీ థీమ్​తో నిర్వహించాలనుకున్నాడు.

శుభ లేఖ నుంచి పెళ్లి మండపం వరకూ సర్వం మోదీ మయం. చిన్ననాటి చిత్తరువుల నుంచి మొదలుకొని మోదీ జీవితంలోని ముఖ్యఘట్టాలను పెద్ద ఫ్రేముల్లో అంతటా పెట్టించాడు. అతిథులంతా మోదీ చిత్రాల్ని చూస్తూ వివాహంలో పాల్గొన్నారు. కొసమెరుపు ఏమిటో తెలుసా..? రిసెప్షన్​లో ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి మోదీ వీడియోలను ప్రదర్శించాడు వీరేంద్ర సింగ్.

"మోదీ తన కోసం ఏమీ చేసుకోవడం లేదు. ఏం చేసినా దేశం కోసమే చేస్తున్నారు. ఆయన అధికారంలో నుంచి వెళ్తే అంతా వెళ్లిపోతుంది. మోదీ చిన్నప్పటి చిత్రాల నుంచి వివిధ పర్యటనలు, సభల్లో పాల్గొన్న వాటి వరకు ఏర్పాటు చేశాను. నా కోసం కాదు దేశం కోసమే ఈ పని చేశాను. దేశ ప్రజల కోసం మోదీ ఆయన కుటుంబాన్నీ త్యాగం చేశారు."
-వీరేంద్ర సింగ్ నరూఖా, వరుడు

ఇదీ చూడండి: భాజపా సర్కార్ మునుగుతున్న నావ: మాయ

ABOUT THE AUTHOR

...view details