నవ భారత నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు ప్రధాని. ప్రధానంగా... జనాభా విస్ఫోటనాన్ని ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు.
జనాభా పెరుగుదలతో రానున్న తరాలకు అనేక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు ప్రధాని. చిన్న కుటుంబం కలిగి ఉండడం ద్వారా దేశాభివృద్ధికి ఉపకరించవచ్చని, అది కూడా ఒక రకమైన దేశభక్తేనని అన్నారు. చిన్న కుటుంబాల నుంచి అన్ని వర్గాల ప్రజలు స్ఫూర్తిపొందాలన్నారు.