తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు

యోగా వ్యాప్తికి అవిశ్రాంత కృషి చేసిన వారికి ఇచ్చే 'ప్రధాన మంత్రి యోగా అవార్డు-2019' కు ఎంపికైన వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ట్విట్టర్​ వేదికగా స్పానిష్​, ఫ్రెంచ్​, అరబిక్​, రష్యన్​, జపనీస్​, ఆంగ్ల భాషల్లో సందేశమిచ్చారు.

యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు

By

Published : Jun 23, 2019, 6:03 AM IST

Updated : Jun 23, 2019, 7:48 AM IST

యోగా అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులకు, సంస్థలకు ప్రదానం చేస్తున్న 'ప్రధానమంత్రి యోగా అవార్డు-2019' కు ఎంపికైన వారికి ట్విట్టర్​ వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. స్పానిష్​, ఫ్రెంచ్​​, అరబిక్​, రష్యన్​, జపనీస్​, ఆంగ్లభాషల్లో తన సందేశాన్ని పోస్ట్​ చేశారు.

యోగా అవార్డు విజేతలకు మోదీ అభినందనలు

" యోగా అభివృద్ధి, ప్రగతికి అత్యుత్తమ కృషి చేసిన వారికి అందించే 'ప్రధాన మంత్రి యోగా అవార్డు-2019'కు ఎంపికైన వారికి అభినందనలు. ఎక్కువ మందిని యోగావైపు నడిపించి మన భూ మండలం ఆరోగ్యంగా ఉండేందుకు మీరు చేసిన కృషికి మేము ఎంతో గర్వపడుతున్నాం."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

విజేతలు...

'ప్రధాన మంత్రి యోగా అవార్డు-2019' కు ఎంపికైన వారిలో ఇటలీకి చెందిన ఆంటోనెట్​ రోసి, గుజరాత్​కు చెందిన లైఫ్​ మిషన్​ వ్యవస్థాపకుడు స్వామి రాజర్షి ముని ఉన్నారు. సంస్థల్లో బిహార్​ యోగా పాఠశాల, జపాన్​ యోగా నికేతన్​లు ఉన్నాయి.

2016లో ఏర్పాటు...

2016 జూన్ 21న ఛండీగఢ్​లో జరిగిన రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును ప్రకటించారు ప్రధాని మోదీ. దీని కోసం ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఆయుష్​ మంత్రిత్వ శాఖ ఆధ్వర్వంలో ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. ఇందులో రెండు కమిటీలు ఉంటాయి. యోగా అవార్డుకు ఎంపికైన వారికి ట్రోపీ, సర్టిఫికేట్​తో పాటు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల నగదు బహుమతి అందిస్తారు.

ఇదీ చూడండి:జడ్జీల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి సీజేఐ లేఖ

Last Updated : Jun 23, 2019, 7:48 AM IST

ABOUT THE AUTHOR

...view details