తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత సామర్థ్యాన్ని మహాకూటమి గుర్తించట్లేదు'

విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత సామర్థ్యాన్ని గుర్తించేందుకు మహాకూటమి పార్టీలు సిద్ధంగా లేవని ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఎన్నికల ర్యాలీ వేదికగా ఆరోపించారు.

By

Published : May 5, 2019, 2:21 PM IST

'భారత సామర్థ్యాన్ని మహాకూటమి గుర్తించట్లేదు'

జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడం భారత సామర్థ్యానికి నిదర్శనమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కానీ విపక్షాలు దీనిని గుర్తించేందుకు సిద్ధంగా లేవని ఉత్తర్​ప్రదేశ్​లోని బదోయిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభ వేదికగా ఆరోపించారు.

భారత్ ఇప్పటివరకూ నాలుగురకాల ప్రభుత్వాల్ని చూసిందని వ్యాఖ్యానించారు మోదీ. వారసత్వ రాజకీయాలు, వామపక్షాలు, ఆర్థిక, భౌతిక బలాల్ని వినియోగించే ప్రభుత్వాల్ని గతంలో చూసిందన్నారు. ప్రస్తుతం అభివృద్ధి సిద్ధాంతంతో నడిచే తమ పాలనపై చర్చ జరుగుతోందన్నారు.

'భారత సామర్థ్యాన్ని మహాకూటమి గుర్తించట్లేదు'

"భారత్​లో అనేక ప్రజల ప్రాణాలు పోయేందుకు కారణమైన మసూద్ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. ఇది పెరుగుతున్న భారత సామర్థ్యానికి నిదర్శనం. కానీ మహాకూటమి పార్టీలు దీనిని గుర్తించేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛభారత్​పై చర్చ జరుగుతోంది. పేదలకు శౌచాలయాల నిర్మాణం, ఇళ్లు, వారి వంటగదుల్లోని గ్యాస్​పై చర్చ జరుగుతోంది. పార్టీ కంటే దేశమే ముఖ్యం. మీరేసే ఓటు దేశాన్ని బలమైన భారత్​గా మార్చేందుకు మరో ముందడుగు అవుతుంది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు ఎప్పుడూ ప్రజల్ని వివిధ జాతులుగా విభజిస్తారు. కేవలం వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకున్నారు. ఆయా పార్టీల నేతల కొన్ని దశాబ్దాల స్థితిని గుర్తు చేసుకోండి... ఇప్పుడు విలాసవంతమైన జీవనం జీవిస్తున్నారు. నేను అవినీతిపై పోరాటం చేస్తున్నది పేద ప్రజల హక్కుల కోసమే."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: కీటకాలతో ఆఫ్రికన్ల నోరూరించే ఐస్​క్రీం...!

ABOUT THE AUTHOR

...view details