తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గాంధీ జయంతి కోసం ఎంపీలకు మోదీ కొత్త టార్గెట్

మహాత్మ గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని 150 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమం చేపట్టాలని ఎంపీలకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాదయాత్రపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్ 2 నుంచి వల్లభ్ భాయ్ పటేల్ జయంతి అక్టోబర్ 31 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

ఈ గాంధీ జయంతికి 150 కిమీలు నడవండి: మోదీ

By

Published : Jul 9, 2019, 12:56 PM IST

గాంధీ 150వ జయంతి సందర్భంగా సొంత నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించాలని భాజపా ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అక్టోబర్2 నుంచి వల్లభ్ భాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 మధ్య కనీసం 150 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సూచించారు.

ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు భవిష్యత్​ కార్యాచరణలో కనిపించాలని మోదీ చెప్పినట్లు సమాచారం.

భాజపా బలహీనంగా ఉన్న ప్రాంతాలకు రాజ్యసభ సభ్యులు

పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించాలని రాజ్యసభ సభ్యులకు పిలుపునిచ్చారు మోదీ.

ఈ యాత్రల ద్వారా గ్రామీణ ప్రాంతాల పునరుజ్జీవనం, స్వావలంబన, మొక్కలు నాటడం, వ్యయం లేని వ్యవసాయంపై అవగాహన వంటి కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.

ఈ గాంధీ జయంతికి 150 కిమీలు నడవండి: మోదీ

"గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రధాని ఎంపీల ముందు ఉంచారు. అక్టోబర్ 2నుంచి సర్దార్​ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్​ 31 వరకు ఉన్న 28 రోజుల్లో ప్రతి లోక్​సభ నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించాలని సూచించారు."

-ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి

ఇదీ చూడండి: భారత్​కు త్వరలో మరో 2 షినుక్​ హెలికాప్టర్లు

ABOUT THE AUTHOR

...view details