తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం

నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని  రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆహ్వానించారు. కేబినెట్​ మంత్రుల పేర్లను సిఫారసు చేయాలని కోరారు కోవింద్. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తేది ఖరారు చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం

By

Published : May 25, 2019, 10:14 PM IST

ప్రధాని నరేంద్ర మోదీని నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆహ్వానించారు. తమ లోక్​సభా పక్షనేతగా మోదీని ఏకగ్రీవంగా ఆమోదించిన ప్రతులను రాష్ట్రపతికి అందజేశారు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​ షా నేతృత్వంలోని ఎన్డీఏ నేతలు. అనంతరం ప్రభుత్వం ఏర్పాటుపై రాష్ట్రపతిని కలిశారు మోదీ.

కేంద్ర మంత్రుల పేర్లను సిఫారసు చేయాలని మోదీని రాష్ట్రపతి కోరారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తేదీని ఖరారు చేయాలని సూచించారు కోవింద్​.

సార్వత్రిక ఎన్నికల్లో 303 ఎంపీ స్థానాల్లో గెలుపొంది అద్భుత విజయం సాధించింది భాజపా. స్పష్టమైన మెజారిటీ ఉన్నా ఎన్డీఏతో కలసి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ప్రభుత్వ ఏర్పాటుకు మోదీకి రాష్ట్రపతి ఆహ్వానం

ఇదీ చూడండి: సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్దాం: మోదీ

ABOUT THE AUTHOR

...view details