తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు" - Rahul Gandhi

రానున్న లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీనిచ్చారు. తమిళనాడులో పర్యటించిన కాంగ్రెస్​ అధ్యక్షుడు​... అన్నాడీఎంకే, మోదీ ప్రభుత్వాలను విమర్శించారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు

By

Published : Mar 14, 2019, 5:57 AM IST

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
కేంద్రంలో కాంగ్రెస్​అధికారం చేపడితే మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నింటిలోనూఈ రిజర్వేషన్లు అమలయ్యేలా చూస్తామని స్పష్టం చేశారు. తమిళనాడులో పర్యటించిన రాహుల్​ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. హోదాతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరికీ న్యాయం సమానంగా ఉండాలని రాహుల్​ అన్నారు. తన బావ రాబర్ట్​ వాద్రాపై విచారణ చేపట్టినప్పుడు... రఫేల్​ ఒప్పందంలో మోదీ పాత్రపైనా విచారణ చేపట్టాలని డిమాండ్​ చేశారు.

ప్రధాని మోదీపై తనకెంతో గౌరవముందని రాహుల్ పేర్కొన్నారు​. అందుకే పార్లమెంట్​లో ఆవేశంతో ఉన్న మోదీని ఆలింగనం చేసుకున్నానని తెలిపారు.
దేశంలోని ప్రధాన వ్యవస్థలను భాజపా తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యాలయమైన నాగ్​పూర్​ నుంచి పాలించడానికి ప్రయత్నిస్తోందని రాహుల్​ ఆరోపించారు.

తమిళ భాష, సంప్రదాయాలపై ఎన్​డీఏ దాడి చేస్తోందని కాంగ్రెస్​ అధ్యక్షుడు విమర్శించారు. ఆన్నాడీఎంకే ప్రభుత్వాన్ని దిల్లీలోని భాజపా ప్రభుత్వం నియంత్రిస్తోందన్న డీఎంకే ఆరోపణలకు రాహుల్​ మద్దతునిచ్చారు.

"ప్రధానమంత్రి కార్యాలయం తమిళనాడు ప్రభుత్వాన్ని నియంత్రిస్తోంది. బెదిరింపులతో దేశంలోని ఏ వ్యవస్థనైనా, ఏ రాష్ట్రాన్నైనా నియంత్రించొచ్చని మోదీ భావిస్తున్నారు. దిల్లీలో కూర్చుని వివిధ రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావొచ్చని మోదీ అనుకుంటున్నారు. కానీ ప్రధాని ఆలోచనలు తప్పు."
---- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ABOUT THE AUTHOR

...view details