తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా మాజీ సీఎం జైలు గదిలో సెల్​ఫోన్​ - haryana former CM

తిహార్​లో జైలులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్​ చౌతాలా గది నుంచి సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. జైలులో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా మొబైల్​ గుర్తించినట్లు తెలిపారు.

హరియాణా మాజీ సీఎం జైలు గదిలో సెల్​ఫోన్​

By

Published : Jun 14, 2019, 5:40 PM IST

హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్​ చౌతాలా జైలు గదిలో సెల్​ఫోన్​ లభించినట్లు తిహార్ జైలు అధికారులు తెలిపారు. గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా చౌతాలా గదిలో సెల్​ఫోన్​తో పాటు ఛార్జర్​, పొగాకు సంచి గుర్తించినట్లు వెల్లడించారు.

ఆ సెల్​ఫోన్​ తనదేనని చౌతాలాతో పాటు అదే జైలు గదిలో ఉండే రమేశ్​ చెప్పాడు.

స్వాధీనం చేసుకున్న సెల్​ఫోన్​ను దిల్లీ పోలీస్​ స్పెషల్ సెల్​ విభాగానికి అప్పగించారు. ఆ ఫోన్ ద్వారా ఎవరితో సంభాషించారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

హరియాణాలో ఉపాద్యాయ నియామక కుంభకోణం కేసులో 10ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు చౌతాలా​. 21 రోజుల పెరోల్ అనంతరం బుధవారం తిరిగి తిహార్ జైలుకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: మాలేగావ్​ పేలుళ్ల కేసు నిందితులకు బెయిల్

ABOUT THE AUTHOR

...view details