తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అడవిలో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన ఎమ్మెల్యే

ఒడిశాలో ఓ నిండు గర్భిణిని సరైన సమయంలో ఆసుపత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు దబుగావ్​​ ఎమ్మె​ల్యే మనోహర్​ రన్​ధారీ. ఆ గ్రామానికి రోడ్డు మార్గం లేనందున గర్భిణిని... దట్టమైన అడవి గుండానే తన భుజాలపై డోలిలో మోసుకెళ్లి మహిళను రక్షించారు.

mla
అడవిలో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన ఎమ్మెల్యే

By

Published : Feb 11, 2020, 1:07 PM IST

Updated : Feb 29, 2020, 11:35 PM IST

అడవిలో గర్భిణిని భుజాలపై మోసుకెళ్లిన ఎమ్మెల్యే

ఒడిశా నబరంగ్​పుర్​ జిల్లాలోని కుసుమ్​కుంఠ గ్రామంలో ఓ నిండు గర్భిణిని ప్రాణాపాయం నుంచి రక్షించారు దబుగావ్​​ ఎమ్మె​ల్యే మనోహర్​ రన్​ధారీ. అడవిలో ఉన్న ఆ గ్రామంలో ప్రసవ వేదనతో సతమతమవుతున్న జీమా బెహరా అనే మహిళను సమయానికి ఆసుపత్రికి చేరుకునేలా సాయపడ్డారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని.. దట్టమైన అడవుల గుండానే భుజాలపై డోలిలో మరికొందరి సాయంతో మోసుకెళ్లారు.

సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తే

కుసుమ్​కుంఠ గ్రామానికి చెందిన జీమా బెహరా అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతోంది. క్షణక్షణానికీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. ఆ గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉన్నందున ఆ ఊరికి సరైన రోడ్డు మార్గం లేదు. కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని పరిస్థితి.

గర్భిణి కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అటుగా వచ్చిన దబుగావ్​ ఎమ్మె​ల్యే మనోహర్​ రన్​ధారీ కంటపడ్డారు. వెంటనే ఈ విషయాన్ని ఎమ్మె​ల్యే దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. త్వరితగతిన స్పందించిన ఎమ్మెల్యే... వాహనం కోసం వేచి చూడకుండా డోలీపై గర్భిణిని తీసుకెళ్లేందుకు పూనుకున్నారు. కొద్దిదూరం అడవిలోనే నడక సాగించి.. ఆ తర్వాత తన సొంత వాహనంలో ఆమెను ఆసుపత్రికి చేర్చారు.

ఇదీ చూడండి: ఈ నెల 24న భారత్​కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్

Last Updated : Feb 29, 2020, 11:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details