తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పదేళ్ల తర్వాత కలుసుకున్న తల్లి-తనయుడు - కొడుకు

పదేళ్ల తర్వాత తల్లీ-కొడుకు ఒక్కటైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని శంషాబాద్​ పట్టణంలో చోటుచేసుకుంది. గుజరాత్​కు చెందిన శాంతాబాయి..​ మానసిక స్థితి సరిగ్గా లేక 10 సంవత్సరాల కింద ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన తల్లి ఆచూకీ తెలుసుకునేందుకు కొడుకు మహేంద్ర ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చివరకు ఉత్తర్​ప్రదేశ్​ పోలీసుల సాయంతో పదేళ్లకు కలుసుకున్నారు.

పదేళ్ల తర్వాత పోలీసుల సాక్షిగా ఒక్కటైన తల్లి-తనయుడు

By

Published : Aug 13, 2019, 12:35 PM IST

Updated : Sep 26, 2019, 8:39 PM IST

పోలీసుల సాక్షిగా ఒక్కటైన తల్లి-తనయుడు

మనం ఇంటికి వెళ్లగానే అమ్మ ఒక్క క్షణం కనపడకపోయినా కంగారు​ పడతాం. నిద్రలోంచి లేవగానే అమ్మా.. అమ్మా అంటూ దగ్గరికి వెళతాం. ఆ మాతృమూర్తి ఒక్కసారి కనిపించకపోతేనే అంతలా బాధ పడుతాం. అలాంటిది కనిపించకుండా పోయిన తన తల్లిని పదేళ్ల తర్వాత చూసిన ఈ గుజరాత్ ​వాసి సంతోషం వర్ణణాతీతం.

ఇలా కలిశారు...

36 ఏళ్ల మహేంద్ర గుజరాత్​లోని సఖేడా నివాసి. 10 సంవత్సరాల క్రితం తన తల్లి శాంతాబాయి... ఇంటిని వదిలి వెళ్లిపోయింది. ఆమెకు మహేంద్రతో పాటు ఇద్దరు కూతుళ్లున్నారు. ఆ సమయంలో ఆమెకు మానసిక స్థితి సరిగ్గా లేదు. బంధువులందరూ ఆశలు వదిలేసుకున్నారు. కొడుకు మాత్రం తల్లి ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించాడు. కానీ ఫలితం దక్కలేదు.
ఇటీవలే ఉత్తర్​ప్రదేశ్​లోని శంషాబాద్​ పట్టణంలో చిన్నపిల్లలను అపహరిస్తుందనే అనుమానంతో స్థానికులు ఒక మహిళపై దాడి చేశారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆ మహిళ పరిస్థితిని చూసి జాలిపడ్డ పోలీసులు వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

"ఆమె వివరాల కోసం ప్రయత్నించాం. కానీ ఆ మహిళకు తన పేరు మాత్రమే గుర్తుంది. దుస్తులు సరిగ్గా లేవు. ఆమెకు మంచి బట్టలు ఇచ్చాం. భోజనం పెట్టాం. టీ తాగించాం. ఆ తర్వాత మళ్లీ కొన్ని ప్రశ్నలు అడిగాం. తన గ్రామం పేరుతో సహా మరిన్ని వివరాలు చెప్పింది. వాటి ప్రకారం గుజరాత్​లోని అనేక ఠాణాలను సంప్రదించాం."
- అరవింద్​ సింగ్​, శంషాబాద్​ స్టేషన్​ ఆఫీసర్​

ఎంతో శ్రమించిన అనంతరం శాంతాబాయి తమ వద్ద ఉందని మహేంద్రకు సమాచారం అందించారు పోలీసులు. ఆదివారం శంషాబాద్​ పోలీస్​ స్టేషన్​కు చేరుకుని తన తల్లిని చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యాడా పుత్రుడు. శాంతాబాయి​ కూడా తన కొడుకుని చూసి కన్నీరు పెట్టుకుంది.

ఇదీ చూడండి:- బేర్‌గ్రిల్స్‌తో ప్రధాని మోదీ సాహసయాత్ర

Last Updated : Sep 26, 2019, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details