తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అదృశ్యమైన ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్ట్‌

పెరోల్​పై వెళ్లి పరారైన ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషి.. జలీస్​ అన్సారీని ఉత్తర్​ప్రదేశ్​ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నమాజ్​ కోసమని బయటకు వెళ్లి తిరిగి రాలేదని అతని కుమారుడు ముంబయి ఠాణాలో ఫిర్యాదు చేయగా... పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు.

missing-1993-mumbai-bomb-blasts-convict-held-in-kanpur
అదృశ్యమైన ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్ట్‌

By

Published : Jan 18, 2020, 5:11 AM IST

అదృశ్యమైన ముంబయి పేలుళ్ల సూత్రధారి అరెస్ట్‌

పెరోల్‌పై ఉండి కనిపించకుండా పోయిన ముంబయి పేలుళ్ల సూత్రధారి జలీస్‌ అన్సారీని ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కాన్పుర్‌లోని ఓ మసీదు నుంచి బయటకు వస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ప్రత్యేక కార్యదళం పోలీసులు వెల్లడించారు. అనంతరం.. అన్సారీని లఖ్‌నవూ తరలించినట్లు తెలిపారు.

'డాక్టర్‌ బాంబ్‌'గా పేరున్న వైద్యుడు అన్సారీ ముంబయి నగరంలోని మొమిన్‌పురా ప్రాంతంలోని తన నివాసం నుంచి గురువారం కనిపించకుండా పోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు ముంబయిలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు.

ఎన్నో ఉగ్ర కుట్రల్లో భాగం...

1992లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక విధ్వంసకర ఘటనలు జరిగాయి. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా 1993 డిసెంబర్‌ 6న ముంబయి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో 43 వరుస బాంబు పేలుళ్లు, ఏడు రైళ్లలో కూడా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ కుట్ర రచన, అమలులో అన్సారీ ముఖ్యపాత్ర పోషించినట్లు రుజువైంది. దీంతో అతడికి జీవిత ఖైదు పడింది.

ఈ కేసులో జీవితఖైదును అనుభవిస్తుస్తున్న 68 ఏళ్ల అన్సారీని ఇటీవలే ముంబయిలోని ఆర్థర్‌ రోడ్‌ జైలుకు తరలించారు. నెల క్రితం పెరోల్‌పై విడుదలైన అతడు ఈ నెల 17న ఉదయం 11 గంటలకల్లా జైలు వద్ద హాజరు కావాల్సి ఉండగా అదృశ్యమయ్యాడు.

ఇదీ చూడండి:పెరోల్​ టు పరార్​- ముంబయి పేలుళ్ల కేసు దోషి మాయం

ABOUT THE AUTHOR

...view details