ఉత్తరప్రదేశ్ మథురలో ఓ వైద్యునిపై కొంత మంది దుండగులు ఆటవికంగా దాడి చేశారు. ఒంటరిగా ఉన్న వ్యక్తిని కర్రలు, తుపాకులతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి.
కారు పార్కింగ్ స్థలంలో జరిగిన వాగ్వాదం వల్ల డాక్టర్ రాహుల్‌పై ఓ పన్నెండు మంది దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో రాహుల్‌తో పాటు అతని తమ్ముడికి తీవ్ర గాయాలయ్యాయి.
"పార్కింగ్ స్థలంలో నా బండి ఆగి ఉంది. పక్కనే ఉన్న బండివాళ్లు నాపై అరిచారు. బండి తీసివేయమని అన్నారు. నేను తీసేలోపే తిట్టడం మొదలుపెట్టారు. ఇందులో ఒకరి పేరు రాజీవ్. మిగతావాళ్ల గురించి నాకు తెలియదు. వాళ్లు మా ఇంటిపైన ఉంటారని అందరూ అంటున్నారు. కారులో కూర్చొని తాగుతున్నారనుకుంటా. నేను తిట్ట వద్దు అంటున్నప్పడు వాళ్లు గాల్లోకి ఓసారి కాల్పులు జరిపారు. తరువాత నన్ను లాఠీలతో కొట్టడం మొదలుపెట్టారు. నా వేలు విరిగింది. నాతో పాటు ఉన్న నా తమ్ముడికి తలపై పెద్ద గాయమైంది." -రాహుల్, బాధితుడు