తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నమో 2.0 : మంత్రివర్గం నుంచి సీనియర్లకు ఉద్వాసన - ఉద్వాసన

రెండోసారి కొలువుదీరిన మోదీ ప్రభుత్వంలో కొందరు ప్రముఖులకు చోటు దక్కలేదు. గత ఐదేళ్లు మంత్రులుగా పని చేసిన కొంతమంది సీనియర్లకు ఈ సారి నిరాశే ఎదురైంది. అందులో మేనకా గాంధీ, సురేష్​ ప్రభు, జేపీ నడ్డా, రాధా మోహన్​ సింగ్​ లాంటి వారు ఉన్నారు.

మంత్రివర్గం నుంచి సీనియర్లకు ఉద్వాసన

By

Published : May 31, 2019, 5:08 AM IST

Updated : May 31, 2019, 7:46 AM IST

మంత్రివర్గం నుంచి సీనియర్లకు ఉద్వాసన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో కొంత మంది సీనియర్లకు చోటు దక్కలేదు. మోదీ హయాంలోనే కేంద్ర మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన కొందరికి ఈ సారి నిరాశే ఎదురైంది. రాష్ట్రపతి భవన్​ ఎదుట గురువారం జరిగిన కార్యక్రమంలో మోదీ సహా 58 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మంత్రి మండలిలో చోటు దక్కనిది వీరికే..

కేబినేట్​ మంత్రులు

  • మేనకా గాంధీ
  • సురేష్​ ప్రభు
  • జేపీ నడ్డా
  • రాధా మోహన్​ సింగ్​

సహాయ మంత్రులు

  1. రాజ్యవర్ధన్​ సింగ్​ రాథోడ్​
  2. మహేశ్​ శర్మ
  3. జయంత్​ సిన్హా
  4. ఎస్ఎస్​ అహ్లువాలియా
  5. విజయ్​ గోయల్​
  6. కె.అల్ఫోన్స్​
  7. రమేష్​ జిగాజినాగి
  8. రామ్​ క్రిపాల్​ యాదవ్​
  9. అనంత్​ కుమార్​ హెగ్డే
  10. అనుప్రియా పటేల్​
  11. సత్యపాల్​ సింగ్​

సహాయ మంత్రుల్లో అల్ఫోన్స్​ మాత్రమే ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మిగతా వారందరూ విజయ దుందుభి మోగించారు.

మేనకా గాంధీని ప్రొటెమ్ స్పీకర్​గా నియమించే అవకాశాలు ఉన్నాయి.

అరుణ్​ జైట్లీ, సుష్మా స్వరాజ్​, ఉమా భారతీకి కేబినేట్​లో చోటు దక్కలేదు. ఆర్థిక మంత్రిగా చేసిన జైట్లీ అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో మంత్రి పదవి వద్దని తెలిపారు. సుష్మా స్వరాజ్​, ఉమా భారతి లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

Last Updated : May 31, 2019, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details