తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​లో బలగాల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్​లో మోహరించిన దళాల్లో 7వేలకు పైగా సైనికులను తక్షణమే ఉపసంహరించుకుంటునట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.

withdraw
సైన్యం

By

Published : Dec 24, 2019, 11:53 PM IST

జమ్ముకశ్మీర్​లోని సైనిక బలగాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 7వేలకు పైగా పారామిలిటరీ దళాలను కశ్మీర్​ నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది కేంద్ర హోంమంత్రిత్వశాఖ. నేడు జరిగిన భద్రతా సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. అనంతరం ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు స్పష్టం చేసింది.

ఆర్టికల్​ 370రద్దు అనంతరం కశ్మీర్​లో మోహరించిన సైనిక బలగాల్లోని.. 72కంపెనీలను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాల 24 కంపెనీలు, సరిహద్దు భద్రతా దళం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ దళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్ దళాలకు చెందిన కంపెనీలను ఉపసంహరించుకోనున్నారు.

జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్​ 370ని రద్దు చేసిన అనంతరం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా.. సీఆర్​పిఎఫ్​, బీఎస్​ఎఫ్​, ఐటిబీ, సీఐఎస్​ఎఫ్​, ఎస్​ఎస్​బీ బలగాలను మోహరించింది కేంద్రం.

ఇదీ చూడండి : గవర్నర్​ను కలిసిన సోరెన్​.. 29న ప్రమాణస్వీకారం!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details