మిస్ జమ్ము కశ్మీర్-2019 పోటీల్లో డాక్టర్ మేఘా కౌల్ సత్తా చాటింది. మహారాష్ట్ర పుణెలో అట్టహాసంగా జరిగిన వేడుకలో అందంతో మెప్పించి ఈ ఏడాది కిరీటాన్ని సొంతం చేసుకుంది. మొదటిసారిగా ఈ ఘనత సాధించిన కశ్మీరీ పండిత్గా చరిత్రకెక్కింది.
"కశ్మీరీ పండిత్లకు వలసల తర్వాత తిరిగి రావటం చాలా కష్టమైపోయింది. కానీ అందరికీ తెలుసు వాళ్లకు సానుకూలాంశం చదవటమని. నేను చిన్నతనంలోనే నిర్ణయం తీసుకున్నా. చదవటం, ఆటలు, ఫ్యాషన్, ఇతర విషయాల్లోనూ భాగం కావాలని. పండిత్ అని కాకున్నా ఓ మనిషిగా నేను సాధించాను. అయితే కశ్మీరీ పండిత్ పేరు దీనివల్ల మళ్లీ బయటికి రావటం సంతోషాన్నిచ్చింది. నాకు చాలా మద్దతు లభిస్తోంది. చాలా మంది వచ్చి కలుస్తున్నారు. ఎన్నో లేఖలు వస్తున్నాయి. మా స్నేహితుల తల్లిదండ్రులూ ఫోన్ చేసి మా పేరు నిలబెట్టావు అని కితాబిస్తున్నారు. ఇలాంటి విజయాలు అందరూ సాధించవచ్చు. అందుకు ముందడుగు వేయాలి. నన్ను చూసి అయినా ముందుకు వస్తారని ఆశిస్తున్నా."
-మేఘా కౌల్, మిస్ జమ్ముకశ్మీర్-2019