పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనడానికి చక్కని నిదర్శనం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ప్రాంతానికి చెందిన మృగేంద్ర రాజ్. సుల్తాన్పుర్కు చెందిన బాల మేధావి 12 ఏళ్ల వయసులోనే 135 పుస్తకాలను రచించాడు. చిన్నారుల కథల పుస్తకాలు రాశాడేమో అని తేలిగ్గా తీసుకోద్దండోయ్. ఈ గడుగ్గాయి డీల్ చేసినవి ఎలాంటి అంశాలో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
'ఆజ్ కా అభిమన్యు'(నేటి కాలపు అభిమన్యుడు) అనే కలం పేరుతో చేసిన రచనల్లో మతానికి సంబంధించిన పుస్తకాలు, మహాత్ముల జీవిత చరిత్రలు ఉన్నాయి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితాన్నీ పుస్తకంలోకి ఎక్కించాడు ఈ రాబోయే తరానికి సిసలైన ప్రతినిధి.
ఆరేళ్ల వయస్సులో తొలి పుస్తకం
తన తొలి రచనను ఆరేళ్ల వయస్సులోనే చేశాడు ఈ ఆధునిక అభిమన్యుడు.