తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా! - LATEST NATIONAL NEWS

ఆమె చదివింది ఎమ్​టెక్​. ప్రస్తుతం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. కానీ చేసే పనేంటో తెలుసా? పాములు పట్టడం. ఎందుకిలా చేస్తున్నారని అడిగితే పర్యావరణాన్ని రక్షించడానికంటోంది. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందామా?

Meet Kadambari, the MTech girl who saves snakes
ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!

By

Published : Jan 23, 2020, 5:40 AM IST

Updated : Feb 18, 2020, 1:58 AM IST

ఆమె చదువుతోంది 'లా'.. పాములు పడుతోందిలా!

పాములు పట్టే వాళ్లు అనగానే... సాధారణంగా పురుషులే గుర్తొస్తారు. అయితే మహారాష్ట్రలో ఇందుకు భిన్నంగా ఓ అందమైన యువతి పాములను పడుతోంది. ఎందుకని అడిగితే పర్యావరణాన్ని రక్షించడానికని బదులిస్తోంది.

మహారాష్ట్రలోని అమరావతి పట్టణానికి చెందిన కాదంబరి ప్రదీప్​ చౌదరి అనే యువతి సరీసృపములు (రెప్​టైల్స్​)ను రక్షించేందుకే పాములను పడుతుంటుంది. తద్వారా పర్యావరణం సమతుల్యం అవుతుందని చెబుతోంది. చుట్టుపక్కల కనిపించిన పాములను పట్టి.. వాటిని అడవిలో వదిలేస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని కాదంబరి విశ్వసిస్తుంది.

జంతువులను సంరక్షించేందుకు కాదంబరి 'సేవ్ అండ్ సేఫ్ ఆనిమల్' పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా పాములను రక్షించింది. కాదంబరి ఎమ్​టెక్ ​వరకు చదువుకుంది. ప్రస్తుతం న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తోంది. కేవలం పాములను కాపాడటమే కాకుండా.. చాలా ప్రాంతాలకు పర్యటిస్తూ ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటుంది.

ఇదీ చూడండి:ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జీవోపై సుప్రీంకోర్టు స్టే

Last Updated : Feb 18, 2020, 1:58 AM IST

ABOUT THE AUTHOR

...view details