తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడే సుప్రీంకోర్టుకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక - నివేదిక

అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ నేడు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది. సీల్డ్​ కవర్​లో సుప్రీం రిజిస్ట్రార్​కు నివేదిక అందజేయనుంది. ఈ నివేదికపై అత్యున్నత న్యాయస్థానం ఆగస్టు 2న విచారణ చేపడుతుంది.

నేడే సుప్రీంకోర్టుకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

By

Published : Aug 1, 2019, 5:36 AM IST

Updated : Aug 1, 2019, 7:59 AM IST

నేడే సుప్రీంకోర్టుకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నేడు నివేదిక సమర్పించనుంది. పరిశీలన అంశాలను సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు సీల్డ్​ కవర్​లో సమర్పిస్తుందీ కమిటీ. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది. ఆగస్టు 2న ఈ నివేదికను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.

వివాదాస్పద భూమిపై కేసు...

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

'మధ్యవర్తిత్వమే మార్గం...'

మార్చి 8న ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించడానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​

గడువు పొడగింపు

నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది సుప్రీం. జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచిన కోర్టు.. ఆగస్టు 1లోపు మరో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:- పల్లి పట్టి కొనివ్వలేదని తల్లిని చంపాడు

Last Updated : Aug 1, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details