తెలంగాణ

telangana

'మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనను సహించం'

By

Published : Oct 21, 2020, 5:40 PM IST

భారత్​లో మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను ఇటీవల తీసుకొచ్చిన కొన్ని చట్టాలు నొక్కేస్తున్నాయన్న ఐక్యరాజ్య సమితి వ్యాఖ్యలను తప్పుపట్టింది భారత్​. మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేసింది.

MEA counters UN Human Rights chief
భారత విదేశాంగ శాఖ

మానవ హక్కుల సాకుతో చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే సహించబోమని స్పష్టం చేసింది భారత్​. భారత్​లో మానవ హక్కుల కోసం పోరాడే గొంతుకలను ఇటీవల తీసుకొచ్చిన కొన్ని చట్టాలు నొక్కేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్​ మిషెల్​ బాచెలే పేర్కొనటంపై ఈమేరకు స్పందించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని(ఎఫ్​సీఆర్​ఏ) మరింత కఠినతరం చేయటాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొంది భారత విదేశాంగ శాఖ.

" ఎఫ్​సీఆర్​ఏకు సంబంధించి మానవ హక్కులపై ఐరాస హైకమిషనర్​ వ్యాఖ్యలు చూశాం. భారత్..​ చట్టాలు, స్వతంత్ర న్యాయవ్యవస్థల ఆధారంగా పాలన సాగిస్తోంది. చట్టాలను రూపొందించటం మా సార్వభౌమ హక్కు. మానవ హక్కుల సాకుతో చట్టాల ఉలంఘనకు పాల్పడితే సహించేది లేదు. "

- భారత విదేశాంగ శాఖ

స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందే నిధులకు సంబంధించి భారత్​లో అమలవుతున్న ఆంక్షలపై ఆందోళన వ్యక్తం చేశారు ఐరాస మానవ హక్కుల హైకమిషనర్​ మిషెల్​ బాచెలే. మానవ హక్కులను పరిరక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి: 'పోరాడే గొంతుకలను ఆ చట్టాలు నొక్కేస్తున్నాయి'

ABOUT THE AUTHOR

...view details