తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈసీ 'మోదీ కోడ్​ ఆఫ్​ కండక్ట్'ను పాటిస్తోంది​ : కాంగ్రెస్​ - CONGRESS

ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షాల ఎన్నికల కోడ్​ ఉల్లంఘనలపై కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు కాంగ్రెస్​ సీనియర్  నేత అభిషేక్​ మను సింఘ్వీ. మోదీ, షా ద్వయం పదే పదే ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమిస్తున్నా ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. 'మోడల్​ కోడ్ ఆఫ్​ కండక్ట్'​  ఇప్పుడు 'మోదీ కోడ్ ఆఫ్ కండక్ట్'​గా మారిందని విమర్శించారు సింఘ్వీ.

Congress

By

Published : Apr 28, 2019, 8:02 AM IST

ఈసీ 'మోదీ కోడ్​ ఆఫ్​ కండక్ట్'ను పాటిస్తోంది​ : కాంగ్రెస్​

ఎన్నికల సంఘం తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్​. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా ద్వయం ఎన్నిసార్లు ఎన్నికల ప్రవర్తన నియమావళిని అతిక్రమించినా ఈసీ చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తోందని ఆరోపించింది. ఈ విషయంపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ.

"మోడల్ కోడ్​ ఆఫ్ కండక్ట్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) కాస్తా మోదీ కోడ్​ ఆఫ్​ కండక్ట్ ​(మోదీ ప్రవర్తన నియమావళి) అయిందా?. ఎలక్షన్​ కమిషన్..​ ఎలక్షన్​ ఒమిషన్​ అయిందా? మోదీ, షా ద్వయం కోసం ఎన్నికల కోడ్​ను అమలు చేయడం నిలిపివేశారా? వారిద్దరికీ ఎన్నికల ప్రవర్తన నియమావళి మినహాయింపా? మూడు ప్రధానాంశాల్లో ఎన్నికల కోడ్​ను అతిక్రమించారు. విభజన, మనస్పర్ధలు సృష్టించే విధంగా మోదీ, షా ద్వయం ప్రసంగాలున్నాయి. అమర జవాన్ల త్యాగాలపై రాజకీయం చేస్తున్నారు. పోలింగ్​ రోజు కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఉల్లంఘనలు ఇంతకు ముందెన్నడూ జరగలేదు. "
-అభిషేక్ మను సింఘ్వీ, కాంగ్రెస్ సీనియర్​ నేత.

ఇదీ చూడండి:మోదీ లెక్కకు మించి ఖర్చు చేశారు: ఆప్​

ABOUT THE AUTHOR

...view details