తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈవీఎంల మాస్​ ట్యాంపరింగ్​ అసాధ్యం' - TAMPERING

ఈవీఎంల మాస్​ ట్యాంపరింగ్​ అసాధ్యమని అమెరికా నిపుణుడు గెల్బ్ చెబుతున్నారు. స్వతంత్రంగా పనిచేసే ఈ యంత్రాల ద్వారా రిగ్గింగ్​కు పాల్పడే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఈవీఎంలపై సందేహాలున్నాయని ఓట్ల లెక్కింపునకు ముందు ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. గెల్బ్​​ వివరణ ఇచ్చారు.

ఈవీఎంల మాస్​ ట్యాంపరింగ్​ అసాధ్యం: అమెరికా నిపుణుడు

By

Published : May 23, 2019, 5:52 PM IST

ఈవీఎంలను ట్యాంపరింగ్​ చేయడం అంత సులభం కాదని అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణుడు గెల్బ్​ స్పష్టం చేశారు. బిహార్​, ఉత్తరప్రదేశ్​లలో ఈవీఎంలు ట్యాంపరింగ్​కు గురయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల సంఘం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. స్ట్రాంగ్​ రూంలలో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని స్పష్టం చేసింది.

అనుమానాలు అక్కర్లేదు...

భారత్​లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని గెల్బ్​ అన్నారు. ఓ వార్తా సంస్థ ముఖాముఖిలో పలు సందేహాలపై స్పష్టత ఇచ్చారు.

"భారత్​లో ఈవీఎంలకు ఉపయోగించిన సాంకేతికత విశ్వసనీయమైనదని నా పరిశోధనల ద్వారా తెలిసింది. ప్రతి సాంకేతికతలో లోపాలుంటాయి. భారత్​లో వినియోగించిన యంత్రాలు ఆఫ్​లైన్​లో పనిచేస్తాయి. వాటిని ట్యాంపరింగ్​ చేయాలంటే భౌతికంగా విడగొట్టాల్సి ఉంటుంది. మాస్​ ట్యాంపరింగ్​కు పాల్పడటం అసాధ్యం. విశ్వసనీయతకు మరో ప్రామాణికం వీవీప్యాట్​ స్లిప్పులు. ఈవీఎం స్వతంత్రంగా పనిచేసే యంత్రం. ఇతర దేశాలు అనుసరిస్తున్న ఇంటర్​నెట్​ ఓటింగ్​ విధానానికి ఇది పూర్తిగా భిన్నం."
-గెల్బ్​, ఈవీఎం నిపుణుడు.

పాకిస్థాన్​, పలు ఆఫ్రికా దేశాల్లోని ఈవీఎంలపై ఎన్నో పరిశోధనలు నిర్వహించారు గెల్బ్​.

ఇదీ చూడండి: మోదీకి దేశాధినేతల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details