తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహచరుడి చెల్లికి పెళ్లి చేసిన సైనికులు

స్నేహాన్ని పంచుకోవడమే కాదు... బాధ్యతనూ పంచుకున్నారు ఆ సైనికులు. ఉగ్రకాల్పుల్లో అమరుడైన తమ సహచరుడి సోదరి వివాహానికి ఆర్థిక చేయూత అందించారు. అంతేకాదు అన్నలై అప్పగింతలు చేశారు.

By

Published : Jun 16, 2019, 8:14 AM IST

Updated : Jun 16, 2019, 12:00 PM IST

సహచరుడి చెల్లికి పెళ్లి చేసిన సైనికులు

చేసే స్నేహం మరువకు.. మరిచే స్నేహం చేయకు అన్నది నేటి తరం యువతలో ఉన్న ఓ సామెత. అక్షరాలా ఈ సామెతను నిజం చేశారు ఆ సైనిక మిత్రులు.

గరుడ్ కమాండో సైనిక విభాగానికి చెందిన కార్పోరల్ జ్యోతి ప్రకాశ్ నిరాలా 2017లో జమ్ముకశ్మీర్​లో జరిగిన ఉగ్రకాల్పుల్లో అమరుడయ్యాడు. నిరాలా సంపాదనే కుటుంబానికి ఆధారం. కుమారుడు చనిపోయి కుటుంబం ఆర్థిక కష్టాల్లో పడింది. నిరాలాకు పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది. ఈ స్థితిని గమనించిన గరుడ్​ సైనికులు తలో రూ. 500 అందించి పెళ్లికి తోడ్పాటు అందించారు. అన్న లేని లోటు తెలియకుండా వీర జవాను చెల్లెలికి వివాహం జరిపించారు. పెళ్లిలో అన్న బాధ్యతలూ నిర్వర్తించారు.

సైనికుల ఉదారత పట్ల నిరాలా తండ్రి తేజ్ నారాయణ్ కృతజ్ఞతలు తెలిపారు. తమకు కుమారుడు లేని లోటు తెలియకుండా చేశారని ఆనందం వ్యక్తంచేశారు.

భారత ప్రభుత్వం కార్పోరల్ నిరాలాను మరణానంతరం అశోక చక్రతో సత్కరించింది.

సహచరుడి చెల్లికి పెళ్లి చేసిన సైనికులు

ఇదీ చూడండి: 'ఏఈఎస్​' బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్​గ్రేషియా

Last Updated : Jun 16, 2019, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details