లాతూర్లో అన్నదాతలను అమ్మాయిలూ చిన్నచూపు చూస్తున్నారు. వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఆ జిల్లాలో దాదాపు 80-90 మంది యువ రైతుల పరిస్థితి ఇంతే. తమ ఆశలు నెరవేర్చగలిగే స్తోమత రైతులకు ఉండదని, అందుకే వారిని వివాహం చేసుకోలేమని యువతులు తేల్చి చెబుతున్నారు. సాఫ్ట్వేర్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే యువకులనే వారు ఇష్టపడుతున్నారు.
సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు - FARMERS
వ్యవసాయంలోనే సాయం ఉంది. కానీ రైతులకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ఉద్యోగి వరకు అన్నదాతలంటే అందరికీ చిన్నచూపే. ఇప్పుడు ఆ జాబితాలో అమ్మాయిలూ చేరారు.
"వర్షాభారంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. రైతుల వద్ద డబ్బులు లేవు. అందుకే యువతులు అన్నదాతలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. నేను 9 పెళ్లి చూపులకు వెళ్లాను. ఒక్కరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. వ్యవసాయం వదులుకుంటేనే పెళ్లి చేసుకుంటామన్నారు."
- రైతు, లాతూర్ జిల్లా
పంటలు పండిస్తుంటే పెళ్లిళ్లు అవ్వవని, పట్టణాలకు వలస వెళ్లి ఇతర ఉద్యోగాలు చూసుకోవాలని పెద్దలు సలహాలిస్తున్నారు. సంబంధాలు కుదరక, కడుపు నింపే వ్యవసాయాన్ని వదలలేక యువ రైతులు మనోవేదనకు గురవుతున్నారు.