తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీట మునిగిన పురాతన మండి మహాదేవ్​ ఆలయం

హిమాచల్​ ప్రదేశ్​లో కురుస్తున్న భారీ వర్షాలకు మండిలోని పురాతన పంచవత్ర మహాదేవ్​ దేవాలయం 30 శాతం నీట మునిగింది. దేవాలయాన్ని పరిశీలించిన అధికారులు ఆలయానికి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

నీట మునిగిన పురాతన మండి మహాదేవ్​ ఆలయం

By

Published : Aug 19, 2019, 7:43 PM IST

Updated : Sep 27, 2019, 1:39 PM IST

హిమాచల్​ ప్రదేశ్​ మండిలో కురుస్తున్న వర్షాలకు బియాస్​ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నది ఒడ్డున పురాతన పంచవత్ర మహాదేవ్​ దేవాలయం ఉంది. నదీ ప్రవాహం వల్ల పంచవత్ర దేవాలయం 30 శాతం నీట మునిగింది. మునిగిన దేవాలయానికి ఎటువంటి ముప్పు లేదని అధికారులు తెలిపారు. వందల ఏళ్ల చరిత్రగల ఈ దేవాలయం మండి రాజుల కాలంలో నిర్మించారు. దేవాలయంలో శివుడు కొలువై ఉన్నాడు.

నీట మునిగిన పురాతన మండి మహాదేవ్​ ఆలయం

ప్రస్తుతం బియాస్​ నది సాధారణంగా ప్రవహిస్తోంది. కానీ ఎగువన కురుస్తున్న వానలకు పండోహ్​ డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాలయాన్ని పూర్తిగా పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు వరద నీటితో పూర్తిగా మునిగివ ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

ఇదీ చూడండి:బాలింతను ఈడ్చుకెళ్లిన ఆశ్రమ నిర్వాహకులు

Last Updated : Sep 27, 2019, 1:39 PM IST

ABOUT THE AUTHOR

...view details