ఓ పక్క వైరస్ భయం, మరోపక్క అధికారుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి అడవుల్లో జీవనం సాగించాడు. ఉపాధి కోసం తమిళనాడు- చెన్నైకు వెళ్లిన బిరాక్ నాయక్.. కరోనా నేపథ్యంలో తిరిగి తన సొంత రాష్ట్రమైన ఒడిశాకు పయనమయ్యాడు. రైళ్లు, బస్సుల సాయంతో ఎలాగోలా గంజామ్లోని తన గ్రామానికి చేరుకున్న నాయక్‌ను.. స్థానికులు అనుమతించలేదు.
వైరస్ భయంతో ఊరు వద్దంది.. అడవే దిక్కైంది!
కరోనా మహమ్మారి వెంటాడుతుందనే భయంతో ఓ వ్యక్తిని తన సొంతూళ్లోకి రాకుండా అడ్డుకున్నారు గ్రామస్థులు. క్వారంటైన్ వివరాలు తెలియని ఆ వ్యక్తి.. ఇక అరణ్యమే దిక్కనుకున్నాడు. రెండు రోజులపాటు అడవిలోనే గడిపాడు.
వైరస్ భయంతో ఊరు వద్దంది.. అడవే దిక్కైంది.!
క్వారంటైన్ వివరాలు తెలియని నాయక్.. చేసేదేమీలేక అడవే దిక్కనుకున్నాడు. సర్పంచ్‌తో సహా.. గ్రామ పెద్దలెవరూ పట్టించుకోకపోవడం వల్ల రెండు రోజుల పాటు అరణ్యంలోనే గడిపాడు. అనంతరం విషయం తెలుసుకొన్న పోలీస్ అధికారులు.. అతణ్ని తీసుకెళ్లి క్వారంటైన్ చేశారు.
ఇదీ చదవండి:నాట్ల సమయంలోనూ మిడతల దాడులు