తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అఖిలపక్ష భేటీ కోసం మోదీకి దీదీ లేఖ - అఖిలపక్ష

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్నికల్లో వెచ్చించే ఖర్చు, ఎన్నికల సంస్కరణలపై చర్చించడానికి అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

అఖిలపక్ష భేటీ కోసం మోదీకి దీదీ లేఖ

By

Published : Jul 25, 2019, 11:28 PM IST

ఎన్నికల్లో వెచ్చించే ఖర్చు, ఎన్నికల సంస్కరణలపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి దీదీ లేఖ రాశారు.

"ఎన్నికల్లో వెచ్చించే ఖర్చు, సంస్కరణలే అజెండాగా అఖిలపక్ష భేటీ నిర్వహించాలని నేను కోరుతున్నాను. అవినీతికి తావు లేకుండా ఎన్నికలు జరగాలి. దేశంలో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే సంస్కరణలే శరణ్యం" - లేఖ సారాంశం

2019 లో జరిగిన సాధారణ ఎన్నికలు అత్యంత ఖరీదైన ఎన్నికలని కొన్ని రోజుల క్రితం మమతా ఆరోపించారు. 2019 కన్నా రానున్న 2024 సాధారణ ఎన్నికల ఖర్చు దాదాపు లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని మమతా బెనర్జీ అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details