తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వలసదారుల కాలనీలు క్రమబద్ధీకరించిన దీదీ - మమతా బెనర్జీ

పశ్చిమ్​ బంగ​లోని వలసదారుల కాలనీల్లో నివసిస్తున్నవారు భారతీయులేనన్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వారి పౌరసత్వాన్ని ఎవరూ తొలగించలేరని వ్యాఖ్యానించారు. 119 వలసదారుల కాలనీలను క్రమబద్ధీకరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Mamata regularises 119 refugee colonies, says their inhabitants were Indians
మమతా బెనర్జీ

By

Published : Mar 4, 2020, 9:48 AM IST

Updated : Mar 4, 2020, 1:54 PM IST

వలసదారుల కాలనీలు క్రమబద్ధీకరించిన దీదీ

పశ్చిమ్​ బంగలోని 119 వలసదారుల కాలనీలను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఆ వలసదారుల పూర్వీకులు భారతీయులుగా పేర్కొన్న మమత... వారి పౌరసత్వాన్ని ఎవరూ తొలగించలేరని అన్నారు. ప్రత్యేకంగా పౌరసత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.

చూస్తూ ఊరుకోం..!

భాజపా వాళ్లు చేసే ప్రకటనలకు ఎవరూ భయపడవద్దని ప్రజలకు సూచించారు దీదీ. ఈ వలసదారులందరూ భారతీయులేనని అన్నారు. వీరందరికీ రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, ఇళ్ల చిరునామాలు ఉన్నాయన్నారు. వాళ్లకు భాజపా ఇచ్చే ఏ పౌరసత్వం అక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరినైనా బంగాల్ నుంచి బయటకు పంపుతుంటే.. చూస్తూ ఉండబోనని తెలిపారు.

1971 బంగ్లాదేశ్ విభజన తర్వాత లక్షలాదిమంది ముస్లింలు, హిందువులు పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ్​ బంగకు వచ్చి కాలనీల్లో ఉంటున్నారు.

ఇదీ చూడండి:ప్రజాస్వామ్య భారతాన్ని కాపాడుకోలేమా?

Last Updated : Mar 4, 2020, 1:54 PM IST

ABOUT THE AUTHOR

...view details