తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బుల్​బుల్​' నష్టాన్ని పూడ్చే దిశగా.. సీఎంల కృషి! - death toll raises

బుల్​బుల్ తుపాను కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఒడిశాలోని తుపాను బాధితులకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు నిత్యావసర సరుకులు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు.

'బుల్​బుల్​' నష్టాన్ని పూడ్చే దిశగా

By

Published : Nov 12, 2019, 7:53 AM IST

బుల్​బుల్​ తుపాను కారణంగా మరణించినవారి సంఖ్య 14కు చేరింది. ఈ నేపథ్యంలో బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తుపాను ప్రభావిత ప్రాంతాలను హెలికాఫ్టర్​ ద్వారా వీక్షించారు. తుపాను కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించారు.

తుపాను నష్టాన్ని తగ్గించేందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు మమత.

"మా అధికారులు చాలా సాధికారతతో పనిచేశారు. 1.78వేలమందిని అధికారులు సురక్షితంగా కాపాడి ఉండకపోతే ఏం జరిగి ఉండేదో ఊహించడం కష్టమే. వారి కృషిని కేంద్ర ప్రభుత్వం కూడా అభినందించింది."

-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి


బుల్​బుల్​ బాధితులకు 471 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు.

'ప్రత్యేక ప్యాకేజీ అందిస్తాం'

బుల్​బుల్ తుపాను బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని అందిస్తామని వెల్లడించారు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. రాష్ట్రంలోని తుపాను బాధిత ప్రాంతాల్లో పునారావాస చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. జరిగిన నష్టంపై నవంబర్ 18లోగా నివేదికను అందజేయాలని సూచించారు. నవంబర్ 24లోగా బాధితులకు సహాయం అందించేందుకు యోచిస్తున్నట్లు వెల్లడించారు పట్నాయక్.

తుపాను ప్రభావిత ప్రాంతాలైన భద్రక్, బాలాసోర్, కేంద్రపారా, జగత్​సింగ్ పుర్, జైపుర్, మయూర్​బంజ్​ జిల్లాలను హెలికాఫ్టర్​ ద్వారా వీక్షించారు నవీన్ పట్నాయక్. ఒడిశాలో 5500 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 3 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇదీ చూడండి: నేడు గురునానక్ జయంతి-వైభవంగా ఏర్పాట్లు!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details