తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జూడాలతో మమత చర్చలు.. మీడియాకు అనుమతి - BENGAL

బంగాల్​లో ఉద్ధృతంగా సాగుతున్న వైద్యుల సమ్మెను విరమింపజేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జూడాలతో సమావేశమయ్యారు. సంప్రదింపుల ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారానికీ ప్రభుత్వం అంగీకరించింది.

జూడాలతో మమత చర్చలు.. మీడియాకు అనుమతి

By

Published : Jun 17, 2019, 4:10 PM IST

గత కొద్ది రోజులుగా బంగాల్​లో జరుగుతున్న వైద్యుల ఆందోళనలకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. జూనియర్​ వైద్యుల డిమాండ్లకు అంగీకరించిన మమతా బెనర్జీ.. కోల్​కతాలో వారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రతి వైద్య కళాశాల నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున చర్చల్లో పాల్గొన్నారు. మీడియా తప్పనిసరిగా ఉండాలని షరతు విధించిన జూడాల డిమాండ్​కు అంగీకరించింది ప్రభుత్వం.

బంగాల్​లో వారం రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు వైద్య విద్యార్థులు. దాడికి గురైన వైద్యులకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసనలకు దిగారు. 2 రోజుల ముందే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. రాష్ట్రంలోని జూడాల డిమాండ్​లకు అంగీకరించి, చర్చలకు రావాలని ఆహ్వానించారు.

ఒకరోజు తర్వాత ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని.. వేదిక ఎక్కడో సీఎం నిశ్చయించాలని ప్రకటించారు జూనియర్​ వైద్యులు. అనంతరం.. సచివాలయంలో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు మమతా బెనర్జీ.

జరిగిందిదీ...

నీల్​రతన్​ సర్కార్​ (ఎన్​ఆర్​ఎస్​) వైద్య కళాశాల ఆసుపత్రిలో చనిపోయిన ఒక రోగి బంధువులు, గత సోమవారం రాత్రి ఇద్దరు వైద్యులపై దాడిచేసి, తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం నుంచి బంగాల్ వ్యాప్తంగా జూనియర్​ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వైద్య వ్యవస్థ దాదాపు స్తంభించింది. వీరికి మద్దతుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details