తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీచరు కొలువుల్లో పురుషుల సంఖ్యే అధికం

భారత్​లో అధ్యాపకుల్లో పురుషులే అధికంగా ఉన్నారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అధ్యాపకుల నిష్పత్తి 100:73గా ఉన్నట్లు తెలిపింది.

టీచరు కొలువుల్లో పురుషుల సంఖ్యే అధికం

By

Published : Sep 24, 2019, 12:25 PM IST

Updated : Oct 1, 2019, 7:35 PM IST

మనదేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో మహిళల కంటే పురుష అధ్యాపకుల సంఖ్యే ఎక్కువగా ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

కేరళ, పంజాబ్‌, హరియాణా, మేఘాలయ, నాగాలాండ్‌, గోవా రాష్ట్రాలు, దిల్లీ, చండీగఢ్‌లలో మాత్రం మహిళా అధ్యాపకులు అధికంగా ఉన్నారు.

సర్వే ఇలా..

విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్వతంత్ర విద్యాసంస్థలంటూ మూడు కేటగిరీలుగా విభజించి సర్వే నిర్వహించారు. 2018-19 సంవత్సరానికి గాను మొత్తం 962 విశ్వవిద్యాలయాలు, 38,179 కళాశాలలు, 9190 స్వతంత్ర విద్యాసంస్థల్లో అధ్యయనం జరిగింది.

ఫలితాలు

అఖిలభారత స్థాయిలో చూస్తే ప్రతి వందమంది పురుష అధ్యాపకులకు..73 మంది మహిళా బోధకులుంటున్నారు. ముస్లిం మైనారిటీవర్గాల అధ్యాపకుల విషయానికి వస్తే మహిళా టీచర్ల సంఖ్య 57గా ఉంది. దివ్యాంగులైన ఉపాధ్యాయినుల సంఖ్య కేవలం 37 మంది ఉన్నారు.

అధ్యాపకుల ముఖచిత్రం

నర్సింగ్‌ కోర్సుల్లో..

నర్సింగ్‌ కోర్సుల్లో బోధనా సిబ్బంది విషయానికి వస్తే మహిళల సంఖ్య అత్యధికంగా ఉంది. నర్సింగ్‌ కోర్సులు బోధిస్తున్నవారిలో వందమంది పురుషులుంటే మహిళల సంఖ్య 330గా ఉంది.

లక్ష టీచరు పోస్టులు ఖాళీ

దేశవ్యాప్తంగా దాదాపు లక్ష టీచరు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ‘ట్వీట్‌’ చేసింది. వీటిలో రాష్ట్రాల ప్రభుత్వ బడుల్లో ఖాళీల సంఖ్య 84వేలు. ఈ పోస్టుల్లో నియామకాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు అధికారులు.

ఇదీ చూడండి: ఆత్మహత్య చేసుకోమని మహిళకు తోటి ఉద్యోగుల వేధింపులు

Last Updated : Oct 1, 2019, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details