దిల్లీ కలిండి కుంజ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఫర్నీచర్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా మెట్రో రైలు సేవలను అధికారులు నిలిపివేశారు.
ఉదయం ఆరు గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎగసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు.