మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్. నేడు రెండోసారి శాసనసభా పక్షనేతగా ఎన్నికైన ఆయన.. మహాకూటమి నేతృత్వంలో త్వరలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఐదు సంవత్సరాల్లో చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని మిత్రపక్షం శివసేన పట్టుపడుతోన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఫడణవీస్.
"మహారాష్ట్ర ఓటర్లు భాజపా-శివసేన సభ్యులుగా ఉన్న మహాకూటమికి పట్టంకట్టారు. ఈ నేపథ్యంలోనే మహాకూటమి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రత్యామ్నయ మార్గంలో ప్రభుత్వ ఏర్పాటుపై పలు వదంతులు వస్తున్నాయి. అవి వినోదం కోసం మాత్రమే పనికొస్తాయి."