తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి గ్రాండ్ హయత్​ హోటల్​లో​ 'మహా రాజకీయాలు'

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్​ కూటమి బలప్రదర్శన చేపట్టింది. తమ ఎమ్మెల్యేలందరినీ ఒకే చోటికి చేర్చింది. ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్​కు మూడు పార్టీల ఎమ్మెల్యేలందరూ చేరుకున్నారు.

హోటల్​లో 'మహా' డ్రామా-కాంగ్రెస్, ఎన్​సీపీ, శివసేన బల ప్రదర్శన

By

Published : Nov 25, 2019, 7:59 PM IST

ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్​కు చేరుకున్న ఎమ్మెల్యేలు

మహారాష్ట్రలో శివసేన, ఎన్​సీపీ, కాంగ్రెస్‌ కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా ముంబయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో బల ప్రదర్శన చేయనున్నారు. ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఆయన కుమార్తె సుప్రియా సూలే సహా ఇతర ఎమ్మెల్యేలు గ్రాండ్‌ హయత్‌ హోటల్‌కు చేరుకున్నారు.

తామంతా కలిసికట్టుగా ఉన్నామని ఇప్పటికే శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రౌత్‌ ట్వీట్‌ చేశారు. కూటమికి మద్దతునిస్తున్న 162 మంది ఎమ్మెల్యేలను చూడాలంటే రాత్రి 7 గంటలకు ముంబయిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌కు రావాలని మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారిని సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో శిబిరాలను ఏర్పాటు చేసిన ఈ మూడు పార్టీలు తమ ఎమ్మెల్యేలను గ్రాండ్‌ హయత్‌ హోటట్‌కు తరలించాయి.

ABOUT THE AUTHOR

...view details