సాధారణంగా ఏటీఎం దొంగతనాల గురించి మనం వింటుంటాం. కానీ కొందరు దుండగులు ఏటీఎం కియోస్కునే ఎత్తుకెళ్లిన ఘటన మహారాష్ట్ర పుణె జిల్లాలోని యవత్లో జరిగింది.
డబ్బే కాదు... ఏటీఎం మొత్తాన్ని ఎత్తుకెళ్లారు!
మహారాష్ట్ర పుణె జిల్లా యవత్లో కొందరు దుండగులు ఏటీఎం ఎత్తుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో అందులో రూ.30 లక్షలున్నాయి. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఏటీఎం మెషిన్ సహా 30 లక్షలు దొంగతనం
శనివారం రాత్రి కొందరు దుండగులు యవత్ ప్రాంతంలోని ఓ ఏటీఎం కియోస్కును అందులోని డబ్బుతో సహా ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
ఏటీఎంలోని రూ.30 లక్షలతో సహా దుండగులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోంది. నిందితుల కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.
ఇదీ చూడండి: సంక్షోభం: రేషన్ కార్డ్ ఉంటేనే మంచి నీరు