తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో లాక్‌డౌన్ మళ్లీ‌ పొడిగింపు

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ విజృంభిస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మళ్లీ లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తాజా లాక్​డౌన్ జులై 31వరకు కొనసాగుతుందని స్పష్టం చేసింది.

maharashtra govt extends lockdown till july 31
'మహా'లో లాక్‌డౌన్‌ పొడిగింపు

By

Published : Jun 29, 2020, 4:17 PM IST

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ అక్కడి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జులై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్టు సోమవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఇందులో భాగంగా ‘మిషన్‌ బిగిన్‌ అగైన్‌’ పేరుతో మార్గదర్శకాలు విడుదల చేసింది మహారాష్ట్ర సర్కారు.

మహారాష్ట్రలో ఒక్క రోజులో కొత్తగా 5,493 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. దిల్లీ రెండో స్థానంలో ఉంది.

మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,64,626 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 86,575మంది కోలుకోగా.. 7429 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:కరోనా బాధితుల కోసం 'ప్లాస్మా బ్యాంక్​': కేజ్రీవాల్

ABOUT THE AUTHOR

...view details