తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంబయి వర్ష బాధితులకు ముఖ్యమంత్రి భరోసా - Mumbai

ఎడతెరిపిలేని భారీ వర్షాలకు మంగళవారం ముంబయిలోని మలాడ్​తో పాటు పలు ప్రాంతాల్లో గోడలు కూలాయి. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పాయారు. మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను పరామర్శించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడణవీస్​. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

క్షతగాత్రులకు ముఖ్యమంత్రి ఫడణవీస్​ పరామర్శ

By

Published : Jul 2, 2019, 12:43 PM IST

ముంబయిలో గోడ కూలిన ప్రమాదంలో గాయపడ్డ వారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పరామర్శించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న తీరుపై వైద్యులను ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలో ప్రమాదాలు జరుగుతున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫడణవీస్​ హెచ్చరించారు.

భారీ వర్షాలకు పశ్చిమ రైల్వే మార్గంలోని లోకల్ రైళ్లు ఉదయం కాసేపు నిలిచిపోయాయి. ప్రస్తుతం యధావిధిగా నడుస్తున్నాయి. మధ్య రైల్వే మార్గంలోని రైళ్లు మాత్రం తిరిగి ప్రారంభం కాలేదు.

వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం...

మధ్యాహ్నం సముద్రంలో భారీ అలలు ఎగిసిపడే అవకాశమున్నందున పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఫడణవీస్​ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details