తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.24 లక్షల నీటి బిల్లు బాకీపడ్డ సీఎం, మంత్రులు

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, సహా పలువురు మంత్రులు, ప్రతిపక్ష నేతల అధికారిక భవనాలను డీఫాల్టర్​ జాబితాలో చేర్చింది ముంబయి మున్సిపల్​ కార్పొరేషన్​. సుమారు రూ.24.56 లక్షల బిల్లులు బకాయి పడటమే ఇందుకు కారణం. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.

Uddav Thackeray
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే

By

Published : Dec 14, 2020, 5:53 PM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే సహా పలువురు మంత్రుల అధికారిక భవనాల్ని డీఫాల్టర్ (పన్ను ఎగవేత)​ జాబితాలో చేర్చింది ముంబయి పురపాలక సంఘం. ఠాక్రేతో పాటు పలువురు మంత్రుల భవనాల నీటి పన్నులు సుమారు రూ.24.56 లక్షలు చెల్లించాల్సి ఉన్నందును ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

షకీల్​ అహ్మద్​ అనే ఆర్టీఐ కార్యకర్త వివరాలు కోరగా.. ప్రభుత్వ భవానాల నీటి బిల్లుల అంశం బయటపడింది. రాష్ట్ర మంత్రులు, నేతలు గత ఏడాదిగా బిల్లులు కట్టటం లేదని, దాంతో ఆయా భవనాలను డీఫాల్టర్​ జాబితాలో చేర్చినట్లు చెప్పారు షకీల్​.

నీటి పన్నును మంత్రులు తమ జేబు నుంచి కట్టాల్సిన అవసరం లేనప్పటికీ.. ఏడాదికిపైగా పెండింగ్​లో ఉండటం చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర ప్రభుత్వం పెండింగ్​ బిల్లులను చెల్లించకపోవటంపై విమర్శలు ఎదురవుతున్నాయి.

సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​, పలువురు రాష్ట్ర మంత్రులు, ప్రతిపక్ష నాయకులు.. అందరు కలిసి మొత్తం రూ. 24,56, 469 చెల్లించాల్సి ఉంది. ఏడాదిగా ఈ బిల్లులు పెండింగ్​లో ఉన్నాయి.

పలువురు ముఖ్య నేతల నీటి పన్ను వివరాలు..

  • ఉద్ధవ్​ ఠాక్రే (వర్ష బంగ్లా)- రూ. 24,916
  • సీఎం భద్రతా సిబ్బంది భవనం- రూ. 1,35,300
  • జయంత్​ పాటిల్​ (సేవాసదన్​)- రూ. 1,15,288
  • నితిన్​ రౌత్​, విద్యుత్తు శాఖ మంత్రి (పర్నాకుతి)- రూ.1,15,288
  • బాలా థోరట్​, రెవెన్యూ మంత్రి (రాయల్​ స్టోన్​)- రూ.17,779
  • అశోక్​ చావన్​ ( మేఘదూత్​)- రూ. 1,11,005
  • దేవేంద్ర ఫడణవీస్​, ప్రతిపక్ష నేత ( సాగర్​)- రూ. 7,45,856

ఇదీ చూడండి: 'అమ్మలాంటి రంగానికి కీడు తలపెడతామా?'

ABOUT THE AUTHOR

...view details