మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో సహ మంత్రులు నీటి బిల్లులు బకాయి పడ్డ వార్తలను ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ ఖండించింది. ఆ బిల్లులు ముందే చెల్లించారని, అయితే సర్దుబాటులో చిన్న తేడా కారణంగా గతేడాది లెక్కలను పరిగణనలోకి తీసుకోకపోవటమే ఈ తప్పిదానికి కారణమని తెలిపింది.
"అధికారిక భవనాల పేర్ల మీదనే బిల్లు ఉన్నాయి. వీటిని వ్యక్తిగత ఖాతాలకు ఆపాదించటం సరైన చర్య కాదు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు నీటి బిల్లులను 2018 నవంబర్లోనే చెల్లించారు. అయితే బకాయి క్లియరెన్స్ ప్రక్రియలో భాగంగా పాతవాటిని పరిగణనలోకి తీసుకోలేదు. "
-మహారాష్ట్ర ప్రజాపనుల శాఖ