ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్ర జరుగుతోందా? తాజాగా జరిగిన ఓ సంఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. నాగపుర్ విమానాశ్రయం వద్ద ప్రధాని హెలికాఫ్టర్‌ను చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం పోలీసులు.
ఈ చిత్రాలు ముంబయికి చెందిన ఓ వ్కక్తి ఫోన్లో లభ్యమయ్యాయి. గత ఆదివారం మహారాష్ట్ర బండారా జిల్లాలోని సాకోలీ పట్టణంలో ప్రచారానికి వెళ్లారు మోదీ. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు ప్రధాని హెలికాఫ్టర్ ఫొటోలను తీశారని సమాచారం. ముంబయికి చెందిన మరో వ్యక్తి చరవాణిలోనూ ఈ ఫొటోలు లభ్యమయ్యాయని తెలుస్తోంది.