తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముంచెత్తిన వర్షాలు.. మోకాళ్ల లోతు నీటిలో శవయాత్ర!

వాన కురిస్తే ఉప్పొంగే కాలువ నీటితో ఆ ఊరు... చెరువులా మారుతుంది. కాలు తీసి కాలు పెట్టే వీలుండదు. ఈ పరిస్థితుల్లోనే గ్రామంలోని ఓ మహిళ చనిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఆమె మృతదేహానికి శవయాత్ర నిర్వహించారు గ్రామస్థులు.

ముంచెత్తిన వర్షాలు.. మోకాళ్ల లోతు నీటిలో శవయాత్ర!

By

Published : Oct 4, 2019, 3:58 PM IST

Updated : Oct 4, 2019, 8:17 PM IST

ముంచెత్తిన వర్షాలు.. మోకాళ్ల లోతు నీటిలో శవయాత్ర!
మధ్యప్రదేశ్​ మాండ్‌సోర్ జిల్లాలోని నౌగావ్‌ గ్రామంలో వర్షాకాలంలో శవయాత్ర నిర్వహించాలంటే ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వర్షం కురిస్తే ఊరినే ముంచెత్తే కాలువపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామం చెరువును తలపిస్తుంది. ఊరి చివరనున్న కాలువ నిండి నీరు ఉప్పొంగుతుంది. ఈ ప్రవాహంలో గ్రామం దాటి వెళ్లడం పెద్ద సాహసం. అత్యవసర సేవలు అందాలంటే ఇబ్బంది. అంబులెన్స్​ వచ్చేందుకు కూడా వీలు లేకుండా తయారవుతాయి రోడ్లు.

నౌగావ్​ గ్రామంలో ఓ మహిళ మృతి చెందింది. అదే రోజు వర్షం కురిసింది. శ్మశానానికి వెళ్లే మార్గమంతా నీటితో నిండిపోయింది. ప్రవాహం తగ్గే వరకు దాదాపు 8 గంటలు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచారు. వరద వద్ధృతి కాస్త తగ్గాక, బంధువులు, స్థానికులు మోకాళ్ల లోతు నీటిలో పాడెను మోసుకెళ్లారు.

కొన్నేళ్లుగా కాలువపై వంతెన నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదంటూ నిరసన తెలిపారు గ్రామస్థులు. సమస్యపై స్పందించిన మాండ్​సోర్​ కలెక్టర్​ మనోజ్​ పుష్ప్​ వర్షాకాలం ముగిశాక కాలువ నిర్మిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:నేటి భారతం... మహాత్మునికే అపచారం!

Last Updated : Oct 4, 2019, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details