తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

మనుషులకే కాదు.. అత్యవసర పరిస్థితుల్లో శునకాలకూ రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. అయితే, మనకున్న బ్లడ్ బ్యాంకు వసతులు ఆ మూగజీవాలకు లేవు. అందుకే, లూథియానాలోని ఓ విశ్వవిద్యాలయంలో శునకాల కోసం ఓ బ్లడ్ బ్యాంకు ఏర్పాటైంది.

ludhiana-veterinary-university-comes-up-with-blood-bank-for-dogs
శునకాలను ఆపదలో ఆదుకునే 'బ్లడ్ బ్యాంక్'!

By

Published : Sep 18, 2020, 6:13 PM IST

Updated : Sep 18, 2020, 7:20 PM IST

మనుషులకే కాదు.. శునకాలకూ ఓ 'బ్లడ్ బ్యాంక్'

పంజాబ్ లూథియానా గురు అంగడ్ దేవ్ పశు వైద్య-జంతు శాస్త్ర విశ్వవిద్యాలయంలో.. శునకాల బ్లడ్ బ్యాంక్ ప్రారంభమైంది.

ఒంట్లో రక్తం తగ్గి అనారోగ్యాలకు గురవుతున్న శుకాలకు.. ఈ బ్లడ్ బ్యాంకులు ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్యులు. 'ఇదివరకు శునకాలు దానం చేసిన రక్తాన్ని నేరుగా మరో శునకానికి ఎక్కించేవారు. కానీ, ఇప్పుడు బ్లడ్ బ్యాంకుల్లో శునకాలు దానం చేసే రక్తాన్ని.. ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ అని మూడు వర్గాలుగా వేరు చేసి భద్రపరిచే అవకాశముంది. తద్వారా అత్యవసర పరిస్థితిలో అవసరమైన రక్త కణాలనే శునకాలకు ఎక్కించే వీలుంటుంది' అని వివరించారు డాక్టర్ శుకృతి శర్మ.

శునకాల రక్తదానం
బ్లడ్ బ్యాంకులో శునకం

భారత దేశంలో బయోటెక్నాలజీ విభాగం అనుమతితో రెండు శునకాల బ్లడ్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. వాటిలో ఒకటి తమిళనాడులో, మరొకటి తమ విశ్వవిద్యాలయంలోనే ఉందంటున్నారు డాక్టర్ శుకృతి శర్మ. తమ విశ్వవిద్యాలయంలో ఇప్పటివరకు 125 శునకాలకు రక్త మార్పిడి చేశామని తెలిపారు.

శునకాల వైద్యం మరింత సులభం
శునకాలను ఆపదలో ఆదుకునే 'బ్లడ్ బ్యాంక్'!

"ఏటా దాదాపు 25వేల శునకాలకు పరీక్షలు చేస్తాం. వాటిలో సుమారు 500-600 శునకాల్లో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. భారత బయోటెక్నాలజీ విభాగంలో.. 25 రాష్ట్రాలకు చెందిన సంస్థలు బ్లడ్ బ్యాంక్ కోసం ధరఖాస్తు చేసుకున్నాయి. వాటిలో కేవలం రెండు మాత్రమే ఎంపికయ్యాయి. మా విశ్వవిద్యాలయానికీ ఆ అరుదైన అవకాశం దక్కింది. "

- డాక్టర్ శుకృతి శర్మ

ఇదీ చదవండి: ఆస్పత్రి ఆఫర్: 9 లక్షల బిల్లుకు రూపాయి డిస్కౌంట్

Last Updated : Sep 18, 2020, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details